![]() |
![]() |
.webp)
బిగ్‌బాస్ సీజన్-9 లో పన్నెండో వారం దివ్య ఎలిమినేషన్ అవ్వగా పదమూడో వారం 'టికెట్ టు ఫినాలే' కోసం టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అంటే ఈ టాస్క్ లలో గెలిచిన వారు డైరెక్ట్ ఫినాలేకి చేరుకుంటారన్న మాట. నిన్నటి నుండి మొదలైన టాస్క్ లలో ఎవరు గెలిచారో.. ఎవరు ఓడారో ఓసారి చూసేద్దాం.
తొలి ఫైనలిస్ట్ ఎవరో డిసైడ్ చేసేందుకు చదరంగం- రణరంగం అంటూ బిగ్‌బాస్ బుద్ధిబలం, కండబలం వాడాల్సిన టాస్కులు ఇస్తున్నాడు. ముందుగా పెట్టిన టాస్కులో కళ్యాణ్, రీతూ, ఇమ్మాన్యుయేల్ ఆడారు. వీళ్ళ ముగ్గురికి 'కనుక్కోండి చూద్దాం' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గెలవడానికి గార్డెన్ ఏరియాలో రకరకాల మ్యాథ్స్ కొశ్చన్స్ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ ప్రశ్నలని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్స్‌ని బిగ్‌బాస్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పిన ప్రతీ ఆన్సర్‌కి సరిపోయే కొశ్చన్‌ని కంటెస్టెంట్స్ వెతికి తీసుకొని బాక్సులో నిలబడి కెమెరాకి చూపించాల్సి ఉంటుంది. ఎవరైతే బిగ్ బాస్ చెప్పిన ఆనర్స్ కి కరెక్ట్ బోర్డ్ తీసుకెళ్తారో అలా ఎక్కువసార్లు ఎవరు కరెక్ట్ గా చెప్తారో వాళ్ళే విజేత అని బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు. ఇక ఈ టాస్కులో ఇమ్మాన్యుయేల్ గెలిచాడు.
రీతూ మ్యాథ్స్ లో వీక్ అని హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ అందరికి తెలిసిపోయింది. ట్వంటీ డివైడ్ డెడ్ బై ట్వంటీ ఎంత అంటే కూడా చెప్పలేకపోయింది రీతూ.. ఇక బిగ్ బాస్ తనని టూ టేబుల్ చెప్పమని చెప్పాడు. దాంతో తను తడబడుతూనే చెప్పింది. ఇక హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. తను బైపీసీ స్టూడెంట్ అని అందుకే తనకి లెక్కలు రావని రీతూ చెప్పుకొచ్చింది.
![]() |
![]() |